ఆ వార్తల్లో నిజం లేదు

Producer Thanu rubbishes rumours about Vaadivasal - Sakshi

‘ఆకాశమే నీ హద్దురా!’ విజయంతో మంచి జోష్‌ మీద ఉన్నారు సూర్య, ఆయన అభిమానులు.  పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారు సూర్య. అయితే వెట్రిమారన్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.. ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదని చిత్రబృందం ప్రకటించింది. ‘వడివాసల్‌’ అనే నవల ఆధారంగా వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.

కలైపులి యస్‌. థాను నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో సూర్య తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘వడివాసల్‌’ సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అసత్యపు వార్తలను నమ్మొద్దు. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తాం. కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అన్నారు థాను. ఇందులో ఆండ్రియా హీరోయిన్‌గా నటించనున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసిన తర్వాత ‘వడివాసల్‌’ సినిమా మొదలుపెడతారు సూర్య.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top