breaking news
kalaipuli. S Thanu
-
ఆ వార్తల్లో నిజం లేదు
‘ఆకాశమే నీ హద్దురా!’ విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు సూర్య, ఆయన అభిమానులు. పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు సూర్య. అయితే వెట్రిమారన్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.. ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదని చిత్రబృందం ప్రకటించింది. ‘వడివాసల్’ అనే నవల ఆధారంగా వెట్రిమారన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్. థాను నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో సూర్య తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘వడివాసల్’ సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అసత్యపు వార్తలను నమ్మొద్దు. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తాం. కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అన్నారు థాను. ఇందులో ఆండ్రియా హీరోయిన్గా నటించనున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసిన తర్వాత ‘వడివాసల్’ సినిమా మొదలుపెడతారు సూర్య. -
కబాలి విడుదల ఎప్పుడో?
కబాలి చిత్రం రిలీజ్ ఎప్పుడు? అన్న ప్రశ్న దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు యావత్ సినీ ప్రపంచంలోనూ వ్యక్తం అవుతోంది. కారణం కూడా అందరికీ తెలిసిందే. అదే సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయనకు ఇండియాలోనే కాకుండా జపాన్, కెనడా,మలేషియా, సింగపూర్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. వారంతా కబాలి చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎస్ కబాలి చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ప్రెస్టేజియస్ చిత్రం కబాలి. రజనీకాంత్ సరసన రాధికాఆప్తే నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చెన్నై, దుబాయ్, మలేషియా దేశాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ దాదాగా రెండు డైమన్షన్లలో కనిపించనున్నారు. అందులో ఒకటి సాల్ట్ పెప్పర్ గెటప్. ఈ గెటప్ ఇప్పటికే రజనీ అభిమానుల్లో ఆనందోత్సాహాలను రేకెత్తిస్తోంది. చిత్రంలో రజనీకాంత్‌కు పంచ్ డైలాగ్స్ లేక పోయినా ఆయన స్టైల్ మాత్రం అదరగొడతాయని దర్శకుడు రంజిత్ తెలియజేశారు. ఇటీవలే రజనీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. చిత్ర విడుదల ఎప్పుడన్న విషయాన్ని కూడా ఆయన సమీపకాలంలో వెల్లడిస్తూ మే చివరి వారంలో గానీ, జూన్ తొలి వారంలో గాని ఉంటుందని చెప్పారు. అయితే చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను మాత్రం విడుదల తేదీని స్పష్టంగా వెల్లడించలేదు. ఇటీవలే విజయ్ హీరోగా నిర్మించిన తెరి చిత్రాన్ని విడుదల చేసి విజయాన్ని సాధించిన థాను ఆ చిత్రానికి సంబంధించి కొందరు డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారంలో తలనొప్పికి గురైయ్యారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కబాలి చిత్రం గురించి మాట్లాడుతూ చిత్రానికి రజనీకాంత్ ఇటీవల డబ్బింగ్‌ను పూర్తి చేశారని, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి విడుదల తేదీని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అయితే మే నెల 16న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి పాఠశాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ ఒత్తిడిలో మునిగిపోతారు. మరి ఆ సందర్భంలో కబాలి చిత్రాన్ని విడుదల చేసే సాహసం చేస్తారా? అన్న సందేహం కొలీవుడ్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అలాంటి సందేహాలు నివృత్తి కావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.