Producer KS Rama Rao: నన్ను తొలగించలేదు

Producer KS Rama Rao Denied Rumours, Says He Is The FNCC President - Sakshi

Producer KS Rama Rao React On Rumours: ‘ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌’ వైజాగ్‌ అధ్యక్షుడిగా నన్ను తొలగించినట్లు  వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. ఆ ఎఫ్‌ఎన్‌సీసీకి ఇప్పటికీ నేనే అధ్యక్షుడిగా ఉన్నాను’’ అని నిర్మాత కె.ఎస్‌. రామారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వైజాగ్‌ ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడిగా నేను, వైస్‌ ప్రెసిడెంట్‌గా వెంకట్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా కాంతిరెడ్డి ఉన్నాం. విశాఖపట్నంలోని సినిమా రంగానికి చెందిన వివిధ శాఖలకు చెందిన పన్నెండువందలయాభై మంది సభ్యులుగా ఉన్నారు.

చదవండి: ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్‌, 20న సెకండ్‌ సింగిల్‌

ఇటీవలే వైజాగ్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేసి, అధ్యక్షునిగా నన్నే ఉండమని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘వైజాగ్‌ ఎఫ్‌ఎన్‌సీసీ’ అధ్యక్షునిగా నన్ను తొలగించారనీ, సంస్థలో రూ. 30 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయనడం అవాస్తవం. అవగాహన లేనివారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ప్రోత్సాహకాలు ప్రకటించారు. నటీనటులకు స్థిరనివాసం, స్టూడియో నిర్మాణాలకు స్థలం ఇస్తామని పేర్కొన్నందుకు సీఎం జగన్‌గారికి, మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్‌. ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో తప్పుడు వార్తలు రావడం అభివృద్ధికి ఆటంకం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top