Priyanka Chopra : మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో సెటిలైన ఆమె దాదాపు మూడేళ్ల ఇండియాకు వచ్చారు. సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రియాంకకు అభిమానులు ఫ్లకార్డులు, బొకేలతో స్వాగతం పలికారు.
ఆమె వెంట భర్త నిక్ జోనస్, కూతురు కూడా ఉన్నారు. కాగా సరోగసి పద్ధతిలో ప్రియాంక, నిక్ దంపతులు ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన తర్వాత ప్రియాంక భారత్‌కు రావడం ఇదే మొదటి సారి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
#PriyankaChopra spotted at Mumbai airport 🔥💃📷 @viralbhayani77 pic.twitter.com/FPLmDzwoLq
— Viral Bhayani (@viralbhayani77) November 1, 2022