‘వారాణాసి’ బ్యూటీకి అరుదైన గౌరవం | Priyanka Chopra to be honoured at Gold Gala 2026 | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం

Apr 25 2026 12:12 PM | Updated on Apr 25 2026 12:34 PM

Priyanka Chopra to be honoured at Gold Gala 2026

హీరోయిన్‌ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. ఆమెను ‘గ్లోబల్‌ వాన్‌ గార్డ్‌’ పురస్కారం వరించింది. ఆసియా పసిఫిక్‌ కమ్యూనిటీకి చెందిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను ‘గోల్డ్‌ హౌస్‌’ సంస్థ ‘గోల్డ్‌ గాలా’ ఈవెంట్‌లో సత్కరిస్తుంటుంది. ‘గోల్డ్‌ గాలా – 2026’ ఐదో వార్షికోత్సవం ఈ ఏడాది మే 9న లాస్‌ ఏంజిల్స్‌లోని మ్యూజిక్‌ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకలోనే ప్రియాంక చోప్రా గ్లోబల్‌ వాన్‌ గార్డ్‌ సత్కారం అందుకోనున్నారు. 

సినిమా పరిశ్రమలో పాతిక సంవత్సరాల కెరీర్, ఏషియన్‌ పసిఫిక్‌ అండ్‌ వెస్ట్రన్‌ ఇండస్ట్రీల మధ్య వారధిగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో ప్రియాంకను  ఈ అవార్డుకి ఎంపిక చేశారు. 

ప్రియాంకతో పాటు అమెరికన్‌ నటుడు చార్లెస్‌ మైఖేల్‌ మెల్టన్, సౌత్‌ కొరియన్‌ సింగర్‌ కిమ్‌ యూన్‌ జే వంటి వారు ఈ వేడుకలో పురస్కారాలను అందుకోనున్నారు. ‘ఏ న్యూ గోల్డ్‌ వరల్డ్‌’ థీమ్‌తో జరగనున్న ‘గోల్డ్‌ గాలా – 2026’ ఈవెంట్‌లో సినీ ఇండస్ట్రీతో‍ పాటు వ్యాపారం, ఫ్యాషన్, స్పోర్ట్స్‌ వంటి ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన వారికి కూడా అవార్డులను ప్రదానం చేస్తారు. వివిధ రంగాలకు చెందిన 650 మంది ప్రముఖుల సమక్షంలో ‘గోల్డ్‌ 100’ జాబితాలో ఉన్న వారికి అవార్డులు ప్రదానం చేస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement