ఒక్క సోషల్‌ మీడియా పోస్ట్‌కు కోహ్లి ఎంత తీసుకుంటాడో తెలుసా?

Priyanka Chopra and Virat Kohli are the only Indians on the Instagram Rich List 2021 - Sakshi

సెలబ్రిటీలకు ఆదాయ మార్గాలు అనేకం.. సినిమా స్టార్లు, క్రీడా ప్రముఖులు, సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్‌ అందరూ తమ వృత్తులతో సమానంగా ఇతర మార్గాల ద్వారా లెక్కలేనంత సంపాదనను ఆర్జిస్తుంటారు. యాడ్స్‌, బిజినెస్‌, ప్రయోషన్స్‌తో కోట్లలో డబ్బులు కూడగట్టుకుంటారు. సెలబ్రిటీల ఫాలోవర్స్‌ను బట్టి వాళ్ల  స్టేటస్‌ అంతకంతకూ పెరుగుతుంటుంది. అయితే సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోష‌ల్ మీడియా వేదికలపై చేసే పోస్ట్‌ల‌తో కూడా భారీగా సంపాదిస్తార‌ని మీకు తెలుసా? అవును తాజాగా హాప‌ర్‌హెచ్‌క్యూ 2021 ఇన్‌స్టాగ్రామ్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌లో అత్య‌ధిక సంపాదన అందుకునే సెల‌బ్రిటీలెవరో ఇక్కడ తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో ఈ జాబితాలో టాప్‌లో నిలిచారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మంది ఫాలోవ‌ర్లు ఉన్న పోర్చుగ‌ల్ ఆటగాడు ఒక్కో ప్రమోషనల్‌ పోస్ట్‌కు 1,604,000 డాలర్లు (దాదాపు 11.9 కోట్లు) వ‌సూలు చేస్తున్నాడు. గత సంవత్సరం తొలి స్థానంలో ఉన్న డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ రెజ్లర్‌ స్టార్ డ్వేన్ జాన్స‌న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతని తర్వాత డ్వేన్ అరియానా గ్రాండే, కైలీ జెన్నర్,  సెలెనా గోమెజ్ 3,4,5 స్థానంలో ఉన్నారు.

చదవండి: రాజమౌళికి చేదు అనుభవం.. ట్వీట్‌ వైరల్‌

విరాట్‌కోహ్లి
ఇక ఈ లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లి19 స్థానంలో నిలిచాడు. ఇండియాలోనే అత్య‌ధిక మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్లు ఉన్న విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు ద్వారా 6,80.000 డాలర్లు(దాదాపు5.08 కోట్లు) అందుకుంటున్నాడు. టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియ‌న్ సెల‌బ్రిటీ కూడా కోహ్లినే.

ప్రియాంకా చోప్రా
ఇక విరాట్‌ త‌ర్వాత గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా 27వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌ ద్వారా 4,03,000 డాలర్లు(దాదాపు మూడు కోట్లు) సంపాదిస్తోంది. కాగా గతేడాది 19వ స్థానంలో ఉన్న ప్రియాంక ఈ ఏడాది 27 వ స్థానానికి పడిపోయారు. అయితే ప్రియాంక ఆదాయం గతేడాదితో పోలీస్తే పెరిగింది. మొత్తం 395 మంది సెల‌బ్రిటీలు ఉన్న లిస్ట్‌లో భారత్‌ నుంచి చోటు దక్కించుకున్న వారు వీరిద్దరే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top