
‘గని, ఎఫ్3’ చిత్రాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాల తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కూడా కమిటయ్యారని టాక్. ‘చందమామ కథలు, పీయస్‌వీ గరుడవేగ’ చిత్రాలను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం లండన్‌లో జరపాలనుకుంటున్నారన్నది వార్త. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’, ’ఎఫ్ 3’ సినిమాలు చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ‘11 హవర్’ అనే వెబ్ సిరీస్ చేశారు. నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ ఏడాది చివరికి వరుణ్–ప్రవీణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ఊహించవచ్చు.