Prashanth Neel Full Concentration On Prabhas Salaar Movie - Sakshi
Sakshi News home page

Salaar Movie: ‘సలార్‌’ స్పీడ్‌ పెంచిన ప్రశాంత్‌ నీల్‌, షూటింగ్‌ పూర్తి చేయడంపై దృష్టి

Published Thu, Jun 2 2022 11:43 AM

Prashanth Neel Full Concentration On Prabhas Salaar Movie - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్  హీరోగా కేజీయఫ్‌ ఫేం ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రం ‘సలార్’. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండిచా మూవీ సలార్‌ను తెరకెక్కుతోంది. 'కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలతో సంచలనం సృష్టించని ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకుడు కావడంతో సలార్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడం డార్లింగ్‌ ఫ్యాన్స్‌ సలార్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చదవండి: ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరం: ఎస్వీ కృష్ణారెడ్డి 

గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఓ రెంజ్‌ల ప్రశాంత్‌ నీల్‌ డిజైన్ చేశాడట. సినిమా మొదలైన దగ్గర నుంచి ఒక సీన్‌కి మించి మరో సీన్ ఉండేలా ఆయన ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా చాలా ఫాస్టుగా మొదలైనప్పటికీ అంతే ఫాస్టుగా షూటింగు జరుపుకోలేకపోయింది. ప్రభాస్ ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కే వంటి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్‌ ఆలస్యమైంది. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు 35 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుందట.

చదవండి: పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'

ఇక ప్రభాస్‌ ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తవడం, ప్రశాంత్‌ నీల్‌ కేజీయఫ్‌ 2 విడుదల కావడంతో డైరెక్టర్‌ పూర్తిగా సలార్‌పై దృష్టి పెట్టాడట. అంతేకాదు దీని తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది. అందుకే త్వరగా సలార్‌ పూర్తి చేసి ఎన్టీఆర్‌ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావాలనే ఆలోచన ప్రశాంత్‌ నీల్‌, ఆయన బృందం ఉన్నట్లు సమాచారం. అందుకే ఇకపై సలార్‌ షూటింగు ఆగకుండా వరుస షెడ్యూల్స్‌ను ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు తగిన విధంగా ప్రభాస్ డేట్స్ తీసుకోవడం కూడా జరిగిపోయిందని కూడా అంటున్నారు. కాగా ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement