Pranitha Subhash Shared Her Pregnancy Photoshoot Viral - Sakshi
Sakshi News home page

Pranitha Maternity Pics: హీరోయిన్‌ ప్రణీత బేబీ బంప్‌ ఫొటోలు వైరల్‌

Published Mon, May 23 2022 1:41 PM

Pranitha Subhash Shared Her Maternity Photoshoot Viral - Sakshi

హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ సంతోషం అంతాఇంతా కాదు. తను ప్రెగ్నెంట్‌ అని తెలిసిన దగ్గర నుంచి అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతగానో తహతహలాడుతోంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసింది. భర్తతో కలిసి దిగిన బ్యూటిఫుల్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రణీతను ఇలా చూసిన ఫ్యాన్స్‌ అందమైన యువరాణిలా ఉన్నారు, లవ్‌యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది. ఏప్రిల్‌ నెలలో తను తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ సంవత్సరంలోనే డెలివరీ జరగనున్నట్లు తెలిపింది. కాగా ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. బావ మూవీతో గుర్తింపు సంపాదించుకుంది. అత్తారింటికి దారేది చిత్రంతో బాపుబొమ్మగా మరింత క్రేజ్‌ తెచ్చుకుంది.

చదవండి 👉🏾  మే నాలుగో వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలివే!

హౌస్‌ఫుల్‌ బోర్డ్‌తో హీరో.. తనకే టికెట్లు దొరకలేదని ట్వీట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement