Prabhas To Release Zombie Reddy Movie Official Trailer | జాంబిరెడ్డి ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్న ప్రభాస్‌ - Sakshi
Sakshi News home page

జాంబిరెడ్డి ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్న ప్రభాస్‌

Dec 31 2020 1:03 PM | Updated on Dec 31 2020 1:26 PM

Prabhas To Unleash Zombie Reddy Big Bite On January Second - Sakshi

'ఇంద్ర' మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జ హీరోగా ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం జాంబి రెడ్డి. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లను స్టార్‌ బ్యూటీ సమంత, హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. జనవరి 2న బాహుబలి హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉండబోతుందట. అంటే ప్రభాస్‌ ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: దిల్‌ రాజుతో టాప్‌ హీరోలు.. ఫోటోలు వైరల్‌)

ఏది ఏమైనా జాంబి రెడ్డి టీమ్‌ పోస్టర్‌ సహా ప్రతీది సెలబ్రిటీల చేతుల మీదుగా విడుదల చేస్తూ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేసుకుంటోంది. మొన్న సామ్‌ను రంగంలోకి దింపిన జాంబి రెడ్డి ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్ల జాబితాలో చేరిన ప్రభాస్‌తో సర్‌ప్రైజ్‌ రివీల్‌ చేస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ జాంబిరెడ్డి చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజు, గెటప్‌ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ తదితరులు నటించారు. మార్క్‌. కె. రాబిన్‌ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు ప్రభాస్‌ కూడా జనవరిలో రెండు సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారని టాక్‌. (చదవండి: ఆన్‌లైన్‌లో జోంబీ వేషంతో.. అంతే ఒక్కసారిగా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement