ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. కాస్త ఆలస్యంగా ‘స్పిరిట్‌’? | Prabhas Spirit Movie May Start Next Year January | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. కాస్త ఆలస్యంగా ‘స్పిరిట్‌’?

Aug 25 2024 9:49 AM | Updated on Aug 25 2024 11:31 AM

Prabhas Spirit Movie May Start Next Year January

‘స్పిరిట్‌’ సినిమా సెట్స్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టనున్నారట ప్రభాస్‌. ఆయన హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌΄ పాత్రలో నటించనున్నారు ప్రభాస్‌. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారభించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందట. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలోని ‘రాజా సాబ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. త్వరలో హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) షూట్‌లో పాల్గొంటారు ప్రభాస్‌.  

అర్షద్‌ పిల్లలకు టాయ్స్‌ పంపుతా: నాగ్‌ అశ్విన్‌
‘కల్కి 2898 ఏడీ’లోని ప్రభాస్‌ ΄పాత్రను తక్కువ చేస్తూ ఇటీవల బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. అర్షద్‌ కామెంట్స్‌పై ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు, ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ‘‘నార్త్‌ వర్సెస్‌ సౌత్, టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వంటి అంశాలకు తావు లేదు. అంతా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీనే. అర్షద్‌ సాబ్‌ మెరుగైన పదాలు వాడి ఉండాల్సింది... అయినా ఫర్వాలేదు. ఆయన పిల్లలకు బుజ్జి టాయ్స్‌ (‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కనిపిస్తాయి) పంపిస్తాను. నేను మరింత కష్టపడతాను. ‘కె 2’ (కల్కి 2898 ఏడీ సినిమా రెండో భాగాన్ని ఉద్దేశించి) సినిమా అన్ని థియేటర్లలో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పూర్తి కాగానే ప్రభాస్‌ పాత్ర చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్స్‌ వస్తాయి’’ అని ఓ నెటిజన్‌ పోస్ట్‌కు ‘ఎక్స్‌’ ద్వారా స్పందించారు నాగ్‌ అశ్విన్‌. 

అలాగే మరో నెటిజన్‌ పోస్ట్‌కు స్పందిస్తూ –‘‘ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో నెగిటివిటీ ఉంది. మనం దాన్ని పెంచకూడదు. ప్రభాస్‌గారు అలానే అనుకుంటారని నేను అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ హీరోగా అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 27న విడుదలైంది. ఈ సినిమాకి సీక్వెల్‌ రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement