సర్జరీ సక్సెస్‌.. హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రభాస్‌! | Prabhas Returns To Hyderabad After Knee Surgery In Europe, Airport Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas Knee Surgery: మోకాలీ సర్జరీ తర్వాత హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ప్రభాస్!

Published Wed, Nov 8 2023 2:31 PM | Last Updated on Wed, Nov 8 2023 2:53 PM

Prabhas Return To Hyderabad After Knee Surgery In Europe - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యాడు. మోకాలి సర్జరీ కోసం యూరప్‌ వెళ్లిన ఆయన దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్‌ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మోకాలి సర్జరీ కోసమే యూరప్‌ వెళ్లిన ప్రభాస్‌.. సర్జరీ అనంతరం అక్కడే నెల రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్‌ వచ్చాడు. పుట్టిన రోజు (అక్టోబర్‌ 23)నాడు కూడా అందుబాటులో లేకపోవడం.. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్నా.. ‘సలార్‌’ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఫ్యాన్స్‌కి..ప్రభాస్‌ తిరిగొచ్చారనే వార్త కాస్త ఉపశమనం కలిగించింది. 

నిర్లక్ష్యం ఎందుకు?
ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబోలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం డిసెంబర్‌ 22న రిలీజ్‌ కాబోతుంది. అంటే సినిమా విడుదలకు ఇంకా 44 రోజులు మాత్రమే ఉంది. అయినా ఇంతవరకు ప్రమోషన్స్‌ ప్రారంభించలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాకే దాదాపు రెండు నెలల ముందుగా ప్రమోషన్స్‌ ని స్టార్ట్‌ చేశాడు రాజమౌళి. కానీ సలార్‌ టీమ్‌ మాత్రం ఇంకా మేలుకోవడం లేదు. కంటెంట్‌పై ఎంత నమ్మకం ఉన్నా.. వెనుకాల ప్రభాస్‌ లాంటి స్టార్‌ హిరో ఉన్నప్పటికీ.. విడుదలకు ముందు సరైన ప్రమోషన్‌ ఉంటేనే సినిమాకు హైప్‌ వస్తుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం కరెక్ట్‌ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన మించి పోయిందేమి లేదని, త్వరగా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తే..సినిమాకు కలిసొస్తుందని అంటున్నారు.

 ప్రభాస్‌ బిజీ బిజీ
యూరప్‌ నుంచి తిరిగొచ్చిన ప్రభాస్‌.. త్వరలోనే ‘సలార్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారట. ముంబై, హైదరాబాద్‌, చెన్నై లాంటి నగరాల్లో ఈవెంట్స్‌ చేసేందుకు సలార్‌ టీమ్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ ప్రతి ఈవెంట్‌లో పాల్గొని, ఫ్యాన్స్‌ని  పలకరించబోతున్నాడట. అలాగే దీపావళి కానుకగా ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.  ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌ ఈ రోజే హైదరాబాద్‌ తిరిగొచ్చాడు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మొదటగా సలార్‌ ప్రమోషన్స్‌కే సమయం కేటాయిస్తారట. ఆ తర్వాత మారుతి సినిమాతో పాటు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2898 AD’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement