
'ప్రేమ విషయంలో చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు' అని సరదాగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరయా? అంటే మొదటగా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు పెళ్లి గురించి పట్టించుకునేంత తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం అతడు రాధేశ్యామ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. బుధవారం నాడు ముంబైలో ఈ సినిమా నుంచి మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రెస్‌మీట్‌లో ప్రభాస్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది.
'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు' అన్న డైలాగ్‌ను గుర్తు చేస్తూ 'రియల్ లైఫ్‌లో ప్రేమ విషయంలో మీ లెక్క తప్పిందా?' అని ప్రభాస్‌ను ప్రశ్నించారు. దీనికి అతడు.. 'ప్రేమ విషయంలో చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నాకింకా పెళ్లి కాలేదు' అని సరదాగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.