ప్రభాస్‌ 'కల్కి' కోసం స్పెషల్‌ గన్స్‌.. వీడియో చూశారా..? | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ 'కల్కి' కోసం స్పెషల్‌ గన్స్‌.. వీడియో చూశారా..?

Published Sat, Dec 30 2023 3:42 PM

Prabhas Kalki 2898 AD ReImagining Of Guns - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌  హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. భారీ బడ్జెట్‌తో పాటు ఇండియన్‌ సినిమా అంచనాలకు మించి ఈ చిత్రం తెరకెక్కుతోంది. సలార్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న డార్లింగ్‌ ఇప్పుడు కల్కి చిత్రం గురించి కొన్ని అప్టేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాడు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ మరో 90 రోజుల్లో వస్తుందని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ చెప్పాడు. ఈ క్రమంలో కల్కి సినిమాలో ఉపయోగించిన గన్స్‌ ఎలా తయారు చేశారో తెలుపుతూ ఒక వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఆ వీడియో కూడా అందరినీ నవ్విస్తూ ఆసక్తిగా సాగింది. ఇందులో సరికొత్తగా ఉన్న గన్స్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ విషయానికొస్తే.. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా  కమల్‌హాసన్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఇప్పటికే విడుదలైన  ఫస్ట్‌ గ్లింప్స్‌నకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమా విజువల్స్‌ ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement