Prabhas Breaks Silence On His Marriage Says I Don't Get Irritated - Sakshi
Sakshi News home page

Prabhas: పెళ్లిపై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..అందరికి చెబుతాను రిప్లై

Apr 16 2022 4:08 PM | Updated on Apr 16 2022 5:03 PM

Prabhas Breaks Silence On His Marriage Says I Do Not Get Irritated - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి ఆయన కుటుంబసభ్యులే కాదు, అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్‌ సినిమా రిలీజ్‌ అవుతున్న  సందర్భంలోనూ ప్రతీసారి ఆయనకు ఈ ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. ఇటీవలె రాధేశ్యామ్‌ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ పెళ్లిటాపిక్‌ సోషల్‌ మీడియాలో ఎంత వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రేమ విషయంలో తన అంచనాలు చాలాసార్లు తప్పాయని స్వయంగా ప్రభాస్‌ పేర్కొన్నాడు. తాజాగా నేషనల్‌ మీడియాతో మాట్లాడిన ప్రభాస్‌కు మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎక్కడికి వెళ్లినా పెళ్లి టాపిక్‌ వస్తుందని అసహనానికి గురయ్యారా అని యాంకర్‌ అడగ్గా.. 'లేదు. నా పెళ్లి గురించి ప్రేక్షకులు అడిగినప్పుడు నాకేమీ చిరాకు అనిపించదు.

ఇది సాధారణ ప్రశ్నే. నాపెళ్లి గురించి వారు ఎంతగా ఆలోచిస్తున్నారో అని అనుకుంటాను. వారి స్థానంలో ఉంటే నేను కూడా అలాగే ఆందోళన చెందేవాడిని' అంటూ ప్రభాస్‌ కూల్‌గా బదులిచ్చారు. అయితే మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఏమైనా ప్లాన్‌ చేశారా అని అడగ్గా.. దీనికి నా వద్ద సమాధానం దొరికినప్పుడు తప్పకుండా అందరికి చెబుతాను అంటూ నవ్వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement