కేజీఎఫ్ కాంబినేషన్‌లో ప్రభాస్ ‘సలార్’

‘సలార్’ అంటున్న ప్రభాస్
హీరో ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు పేరు ఖరారు అయింది. ఈ సినిమాకు ‘సలార్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ (కేజీఎఫ్ మూవీ ప్రొడ్యూసర్) నిర్మించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే ప్రభాస్ ప్రధాన పాత్రలో’ఆదిపురుష్’, తెరకెక్కబోతుంది. సలార్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. (బిగ్ ఎనౌన్స్‌మెంట్: కేజీయఫ్ కాంబినేషన్‌లో ప్రభాస్)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి