స్వాతంత్య్రం రాక ముందు...రజాకార్‌ నేపథ్యంలో ప్రభాస్‌ చిత్రం | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రం రాక ముందు...రజాకార్‌ నేపథ్యంలో ప్రభాస్‌ చిత్రం

Published Tue, Apr 9 2024 12:12 AM

Prabhas about Sandeep Reddy Spirit movie - Sakshi

ఇప్పటికే ‘సలార్‌ 2’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు అంగీకరించిన ప్రభాస్‌ తదుపరి సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ చేయనున్నారు. అరవై శాతం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని, డిసెంబరులో షూటింగ్‌ ఆరంభిస్తామని సందీప్‌ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక తాజాగా ప్రభాస్‌ సైన్‌ చేసిన మరో సినిమా ప్రకటన వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇది ఫిక్షనల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ అని మేకర్స్‌ పేర్కొన్నారు. కాగా స్వాతంత్య్రం రాక పూర్వం రజాకార్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. చిత్రసంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలో ఇప్పటికే మూడు పాటలు కంపోజ్‌ చేశామని దర్శకుడు హను తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement