నటి కోసం భార్యని కోమాకి వెళ్లేలా కొట్టాడు: పూనమ్‌ | Poonam Kaur Fresh Allegations On Trivikram Srinivas | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్‌పై పూనమ్‌ మరో బాంబ్‌.. ఈసారి ..

Oct 15 2026 2:19 PM | Updated on Oct 15 2026 2:32 PM

Poonam Kaur Fresh Allegations On Trivikram Srinivas

టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌ మరోసారి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్‌ మీడియా వేదికగా ఆమె పెట్టిన పోస్టులు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో త్రివిక్రమ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన పూనమ్‌.. తాజాగా మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్‌ చేసింది.

ఒకప్పుడు త్రివిక్రమ్‌ సినిమాల్లో కనిపించిన వినోదం, మాటల చమత్కారం ఇప్పుడు కనిపించడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘నీలో ఫన్‌ లేదు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఆ స్థానానికి మళ్లీ నువ్వు వెళ్లలేవు’ అంటూ పోస్ట్‌ పెట్టింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీశాయి.

గురూజీ’ అని పిలుస్తుండటంతో
ఇదిలా ఉండగా.. మరో పోస్ట్‌లో ఓ నటి కోసం తన భార్యపై దాడి చేశాడంటూ ఓ వ్యక్తిని ఉద్దేశించి పూనమ్‌ కౌర్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు. అయితే టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌ను చాలామంది ‘గురూజీ’ అని పిలుస్తుండటంతో ఈ పోస్టు ఆయనను ఉద్దేశించే పెట్టిందా? అంటూ కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా పూనమ్‌ తన పోస్టులో నేరుగా పేరు వెల్లడించకపోవడంతో ఆమె వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయన్నది స్పష్టత రావాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: త్రివిక్రమ్.. నా కుటుంబ బలహీనతని వాడుకున్నారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement