నారీ నారీ నడుము లొల్లి | Pooja Hegde Sensational Comments On South Film Industry | Sakshi
Sakshi News home page

నారీ నారీ నడుము లొల్లి

Nov 8 2020 1:09 AM | Updated on Nov 8 2020 1:09 AM

Pooja Hegde Sensational Comments On South Film Industry - Sakshi

‘దక్షిణాదివాళ్లకు నడుము భాగం అంటే పిచ్చి’ అనే అర్థం వచ్చేట్లు ఓ ఇంటర్వ్యూలో అన్నారు పూజా హెగ్డే. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో తన కాళ్లను చూడటం గురించిన చర్చలో భాగంగా వచ్చిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ‘నాకైతే ఎవరైనా నా కాళ్లు చూస్తే బావుణ్ణు అనుకుంటాను కానీ నడుము కాదు’ అనే ఉద్దేశంలో పూజ మాట్లాడారు. అయితే ఈ మాటలకు సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారామె.

‘సౌత్‌లో పాపులారిటీ పొంది, ఈ ఇండస్ట్రీ గురించే ఇలాంటి కామెంట్స్‌ చేయడం సరికాదు. చాలామంది హీరోయిన్లు ఈ విధంగానే చేస్తున్నారు’ అని నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే, దానికి అంతగా విమర్శించాల్సిన పని లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు మాట్లాడే మాటలు, వాళ్ల అభిప్రాయాలు వెంటనే విమర్శలకు గురవుతున్న కాలం ఇది. ఏ మాట ఎటు దారి తీస్తుందో ఊహించలేం. అందుకే సెలబ్రిటీలు మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తపడలేమో.

Advertisement
 
Advertisement
Advertisement