Alluri Soumya: PIL filed against RRR Move in Telangana High Court - Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలపై స్టే ఇవ్వండి: అల్లూరి సౌమ్య

Jan 5 2022 3:11 PM | Updated on Jan 5 2022 4:39 PM

PIL Filed in Telangana Highcourt on RRR Moive - Sakshi

ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేశారు.

ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిల్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. అయితే పిల్‌ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్‌ ఉజ్జన్‌ భూయాన్‌ బెంచ్‌ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement