రేపు పవన్‌- హరీశ్‌శంకర్‌ మూవీ నుంచి అప్‌డేట్‌

Pawan Kalyan And Harish Shankar Movie Updates Come On september 9th - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్‌ సినిమా తీయాలని డైరెక్ట్‌ర్‌ హరీశ్‌ శంకర్‌ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ పుట్టిన రోజున తమ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందంటూ ప్రీ లుక్‌ విడుదల చేశాడు డైరెక్టర్‌.

కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు ఈ మూవీ నుంచి క్రేజ్‌ అప్‌డేట్‌ రాబోతుందని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.  గురువారం(సెప్టెంబర్‌ 9) 9:45 గంటలకు ఈ మూవీ నుంచి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్‌  ఈ అప్‌డేట్‌ ఎంటో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సినిమాలో పవన్‌కు సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్‌. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పై రానున్నట్లు తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top