ఆ గేమ్‌లోకి వెళ్లను

Nivetha Thomas talking about V movie - Sakshi

నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం  నివేదా థామస్‌ చెప్పిన విశేషాలు.

► నిజానికి ఈ సినిమాని థియేటర్‌ రిలీజ్‌ కోసం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మనందరం పక్కనే ఉన్న షాప్‌కి వెళ్లటానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అయినా ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో విడుదల సరైన నిర్ణయమే. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది.

► ‘వి’ సినిమా చేయడం వెనక నా స్వార్థం కూడా ఉంది. నా పాత్ర నచ్చడం, నానీతో మూడోసారి సినిమా చేయడం, ఇంద్రగంటి సార్‌తో రెండో సినిమా, ‘దిల్‌’ రాజుగారి బేనర్‌లో కంటిన్యూస్‌గా సినిమాలు చేయడం.. ఇవన్నీ నేను ‘వి’ చేయడానికి కారణాలు.  ఈ సినిమాలో నా పాత్ర పేరు అపూర్వ. తను క్రైమ్‌ థ్రిల్లర్స్‌ రాసే నవలా రచయిత. ఇప్పటివరకు నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి.  

► స్వతహాగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఫస్ట్‌ టైమ్‌ ఫ్యామిలీతో చాలారోజులు ఇంట్లో స్పెండ్‌ చేశాను. 17 ఏళ్లుగా మా నాన్న దుబాయ్‌లో వర్క్‌ చేస్తున్నారు. ఆయన ఎప్పుడన్నా అలా వచ్చి ఇలా వెళ్లేవారు. కానీ ఆరు నెలలుగా ఆయనతో బెస్ట్‌ టైమ్‌ గడుపుతున్నాను. ఈ లాక్‌డౌన్‌లో ఎంతోమంది కొత్త దర్శకులు చెప్పిన కథలు విన్నాను. ప్రతి కథ ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ ఫైనల్‌గా నాకు సూట్‌ అయ్యేవే ఎన్నుకుంటాను.

► వెబ్‌ సిరీస్‌లో నటించాలనుకోలేదు. మంచి క్యారెక్టర్‌ వస్తే చేస్తానేమో. ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను. స్టార్డ్‌డమ్‌ అంటూ నంబర్‌ గేమ్‌లోకి రావటం నాకిష్టంలేదు. నేను ఆ బాక్స్‌లో ఉండను. స్టార్‌డమ్‌ కంటే కూడా ‘ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్స్‌ చేస్తుంది’ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top