సినిమా ఆఫర్లు రాకపోతే ఉద్యోగం చేసుకుంటా: హీరోయిన్‌

Nivetha Pethuraj Comments On Heroine Career - Sakshi

Nivetha Pethuraj Comments On Heroine Career: యంగ్‌ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్‌ మదిలో' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత బ్రోచేవారెవరురా, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్‌' వంటి తదితర మూవీస్‌లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే  క్రేజ్‌ సంపాదించుకుంది. ఇటీవల 'బ్లడీ మేరీ' చిత్రంతోనూ ఆకట్టుకుంది. నివేదాకు పర్ఫార్మెన్స్‌ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అయితే స్టార్‌ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 

హీరోయిన్‌ కన్నా నటిగా అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కథానాయికగా సినిమాలు చేయకపోతే కెరీర్‌ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి బౌండరీస్‌ పెట్టుకోలేదు. నటనకు ఇంపార్టెన్స్‌ ఉంటే ఎలాంటి రోల్స్‌ అయినా చేస్తాను. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా. అని తెలిపింది నివేదా పేతురాజ్‌. ఆమె నటించిన  'విరాట పర్వం' సినిమా జూలై 1న విడుదల కానుంది. 

చదవండి: సినిమాల్లోకి రాకముందు నటి నివేదా ఏం చేసేదో తెలుసా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top