జీవితం పోరాటంగా మారింది

Nithya Menen Said I Dont Compare Real Life With Reel Life - Sakshi

సినిమా: జీవితం పోరాటంగా మారిందని నటి నిత్యామీనన్‌ పేర్కొంది. మాతృభాష మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ ఇతర భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నటిగా పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి నిత్యామీనన్‌. పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా న్యాయం చేయడానికి తన వంతు కృషి చేసే ఈబ్యూటీ ఇటీవల నటనకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాలనే అంగీకరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ది ఐరన్‌ లేడీ చిత్రంలో టైటిల్‌ పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ పాత్ర కోసం నిత్యామీనన్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైన నిత్యామీనన్‌ ఒక భేటీలో పేర్కొంటూ నిజ జీవితాన్ని సినిమాను తను ఎప్పుడూ ఒకేలా చూడనని చెప్పింది.

షూటింగ్‌కి వెళితే అది పూర్తవగానే అక్కడితోనే మరచిపోతాం అని ఇంటి వరకు ఆ ప్రస్తానం తీసుకురానని చెప్పింది. అదేవిధంగా షూటింగ్‌లో పాల్గొంటే నిజ జీవితం గురించి మరచిపోతాం అని చెప్పింది. వ్యక్తిగత కష్టనష్టాలను షూటింగ్‌ దరిదాపులకుకూడా తీసుకురానని చెప్పింది. ఒక్కోసారి తాము ధరించిన పాత్రలు మనసును విపరీతంగా హత్తుకుంటాయని అంది.  ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో అందరూ ఇంటిలోనే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఈ సమయంలో మన గురించి మనం తెలుసుకోవడానికి మనల్ని మనమే విమర్శించడానికి ఉపయోగించుకోవాలని చెప్పింది. ఆ విధంగా తనలోని కొరత ఏమిటన్నది ఈ సమయంలో తెలుసుకున్నానని చెప్పింది. ఇకపోతే కరోనా జీవితం పోరాటంగా మారిందని పేర్కొంది.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top