Nithin's 'Macherla Niyojakavargam' Special Video Macherla Dhamki Out - Sakshi
Sakshi News home page

మాచర్ల కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం.. మాచర్ల ధమ్కీ

Published Tue, Jul 26 2022 1:39 PM

Nithiin Macherla Niyojakavargam Special Video Macherla Dhamki Out - Sakshi

నితిన్‌, కృతీశెట్టి జంటగా ఎంఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాచర్ల ధమ్కీ’అంటూ ఓ వీడియోని వదిలారు మేకర్స్‌.

‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలారి మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం’అంటూ నితిన్‌ చేప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లో ఈ స్పెషల్‌ వీడియో ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో నితిన్‌..సిద్ధార్థ్‌ రెడ్డి అనే యంగ్‌ ఐఏఎస్‌ అధికారిగా కనిపించబోతున్నాడు. జులై 30న ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కానుంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజలి ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement