ఆ సినిమా చూసి పవన్‌కి నితిన్‌ విరాభిమాని అయ్యాడట

Nithiin Birthday Special Story - Sakshi

సినిమా అవకాశాల కోసం తిరగకుండానే తేజ లాంటి పెద్ద దర్శకుడి రూపంలో ఆ యువకుడికి హీరోగా అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత ప్రయత్నాలు చేయకుండా వినాయక్‌, రాజమౌళి, రాఘవేంద్రరావు, కృష్ణవంశి లాంటి బడా డైరెక్టర్లు తనని హీరోగా సెలక్ట్‌ చేసుకున్నారు. ప్రతి సినిమా సూపర్‌ హిట్‌ అయింది. అతి చిన్న వయసులోనే స్టార్‌ అయిపోయాడు. కాలం అడ్డం తిరిగింది. వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. స్టార్‌ హోదా పోయింది. దగ్గరి వాళ్లు దూరమయ్యారు. అయినా ‘ధైర్యం’గా నిలబడ్డాడు. తప్పిదాలు తెలుసుకున్నాడు. ఆచి తూచి కథలు ఎంచుకున్నాడు. ‘ఇష్క్‌’తో పనిచేశాడు. పుష్కరకాలం తర్వాత మళ్లీ వి‘జయం’ వరించింది. తనదైన నటనతో ప్రేక్షకుల ‘దిల్‌’లో స్థానం సంపాదించుకొని స్టార్‌ హీరోగా కొనసాగుతున్నాడు. అతనే యంగ్‌ హీరో నితిన్‌. ఈ ‘అల్లరి బుల్లోడి’ 38వ పుట్టిన రోజు నేడు (మార్చి 30). ఈ సందర్భంగా నితిన్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

► నితిన్‌ పూర్తి పేరు నితిన్ కుమార్‌ రెడ్డి.1983 మార్చి 30న సుధాకర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు నిజామాబాద్‌లో జన్మించాడు. 

► నితిన్‌ తండ్రి సుధాకర్ రెడ్డి పాపులర్‌ డిస్ట్రిబ్యూటర్.

► నువ్వు-నేను సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి నా తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. 

► 2002లో 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడ నితన్‌

► తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గూడ అందుకున్నాడు

► దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సినిమా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది

► ఒకానొక దశలో ఏకంగా దశాబ్దానికి పైగా వరసగా 14 సినిమాలు ప్లాపులు వచ్చాయి నితిన్‌కి.

► 2012లో వచ్చిన 'ఇష్క్‌' సినిమాతో మళ్లీ సక్సెస్‌ బాటపట్టాడు

► 2020లో వెంకి కుడుముల రూపొందించిన ‘భీష్మ’తో మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు

► ఈ ఏడాది చెక్‌తో ఎంట్రీ ఇచ్చి.. తాజాగా రంగ్‌దే మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు

► హీరోగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యే గుర్తింపు తెచ్చుకున్నాడు

► పవన్‌ కల్యాణ్‌ నటించిన తొలి ప్రేమను 28సార్లు చూసి పవర్‌ స్టార్‌కు వీరాభిమానిగా మారాడు.

► జూలై 16, 2020న షాలిని కందుకూరితో నితిన్‌ వివాహం జరిగింది. ఈ వేడుకకి పవన్‌ కల్యాణ్ హాజరయ్యాడు

► నితిన్‌ ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్‌ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top