మరికాస్త ముందుకు ఎక్స్‌ట్రా | Nithiin And Sreeleela Extra Ordinary Man To Release On December 8 2023 | Sakshi
Sakshi News home page

మరికాస్త ముందుకు ఎక్స్‌ట్రా

Published Tue, Oct 10 2023 12:01 AM | Last Updated on Tue, Oct 10 2023 12:02 AM

Nithiin And Sreeleela Extra Ordinary Man To Release On December 8 2023 - Sakshi

అనుకున్న సమయానికంటే ముందుగానే థియేటర్స్‌కు వస్తున్నారు హీరో నితిన్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్  హీరోగా ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మేన్ ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్‌ మూవీస్, ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్, రుచిర ఎంటర్‌టైన్ మెంట్స్‌పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను తొలుత డిసెంబరు 23న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ సమయానికి ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌:సీజ్‌ఫైర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘ఎక్స్‌ట్రా’ని కాస్త ముందుగానే డిసెంబరు 8న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్‌ జైరాజ్‌ స్వరకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement