నేతాజీ జీవిత రహస్యాలతో... | Nikhil Siddhartha launches Spy teaser near Netaji statue at Delhi | Sakshi
Sakshi News home page

నేతాజీ జీవిత రహస్యాలతో...

May 16 2023 6:18 AM | Updated on May 16 2023 6:18 AM

Nikhil Siddhartha launches Spy teaser near Netaji statue at Delhi - Sakshi

‘‘నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించి మీరు ఎప్పుడూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందుకే మొదటి టీజర్‌ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఇక్కడ టీజర్‌ను విడుదల చేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాం. నేతాజీ జీవితంపై సాగే అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ చిత్రం ఇది’’ అన్నారు నిఖిల్‌. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ జీవితంలోని రహస్యాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘స్పై’. నిఖిల్‌ హీరోగా గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు.

ఈ చిత్రం టీజర్‌ను సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం దగ్గర రిలీజ్‌ చేశారు. నేతాజీ మరణం తాలూకు మిస్టరీని ఛేదించే స్పై పాత్రలో నిఖిల్‌ కనిపిస్తారు. ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్‌ కథానాయికలుగా, ప్రత్యేక పాత్రలో ఆర్యన్‌ రాజేష్‌  కనిపించనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్‌ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement