మెగా పెళ్ళి సందడి

Niharika Konidela Ties Knot With Venkata Chaitanya In Udaipur - Sakshi

కొణిదెల వారింటి గారాలపట్టి, సినీ నటి నిహారిక వివాహం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి జొన్నలగడ్డ వెంకట చైతన్య, నిహారికల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి దుస్తుల్లో వధూవరులు చూడచక్కని జంట అనిపించుకున్నారు. బంగారు వర్ణపు చీరలో నిహారిక మెరిసిపోయింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

మిస్‌ యూ... నిహా తల్లీ...
నటుడు నాగబాబు, తన కుమార్తె నిహారిక పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక ఫొటోను షేర్‌ చేసి, ‘‘నా చిన్నారి స్కూల్‌కి వెళ్లే వయసులో అడుగుపెట్టినప్పుడు ఇక తనతో రోజంతా ఆడుకోలేమనే ఫీలింగ్‌ వెంటాడేది. ఆ ఫీలింగ్‌ను దూరం చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నా కూతురు తొలిరోజు పాఠశాలకు (పెళ్లిని ఉద్దేశించి) వెళుతున్నట్లుగా ఉంది. అయితే తను సాయంత్రం తిరిగి రాదు. ఇప్పుడు ఈ ఫీలింగ్‌ను పోగొట్టుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి. కాలమే నిర్ణయిస్తుంది. ఆల్రెడీ నిన్ను మిస్సవుతున్నాను నిహా తల్లీ’’ అని భావోద్వేగంతో పేర్కొన్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ సహా మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వివాహ మహోత్సవంలో ఆనందోత్సాహాలతో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.


సుముహూర్త సమయంలో...


కన్యాదాన వేళ...


శుభలగ్న వేళ..., వధూవరుల పూజా సమయం...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top