అలా విడిపోవడం చాలా బాధాకరం..నిహారిక కామెంట్స్‌ వైరల్‌ | Niharika Konidela Interesting Comments On Her Divorce | Sakshi
Sakshi News home page

కొట్టుకొని విడిపోవడం ఈజీ కానీ.. ఇలా విడిపోవడం చాలా బాధాకరం: నిహారిక

Mar 21 2026 1:35 PM | Updated on Mar 22 2026 11:10 AM

Niharika Konidela Interesting Comments On Her Divorce

నటిగానే కాకుండా నిర్మాతగానూ దూసుకెళ్తున్నారు మెగా డాటర్‌ నిహారిక. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకొని.. చిన్న బడ్జెట్‌తో మంచి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఆమె బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు సూపర్‌ హిట్‌ అయింది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరో. ఏప్రిల్‌ 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో నిహారిక బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై స్పందించారు.

నాన్నకే చెప్పా.. 
నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ అనే అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కలిసి కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2023లో ఈ జంట విడిపోయింది.అయితే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే నిహారిక ఈ విషయాన్ని ముందుగా నాన్న నాగబాబుతో పంచుకుందట. ‘రిలేషన్‌షిప్‌ నుంచి బయటకు రావాలని అనుకున్నప్పుడు ముందుగా మా నాన్నకు ఈ విషయాన్ని చెప్పా. ఆయన విషయం మొత్తం విని సైలెంట్‌ అయ్యారు. నేను సంతోషంగా లేననే విషయం వాళ్లకు కూడా తెలుసు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నగారే సలహా ఇచ్చారు’ అని నిహారిక చెప్పారు.


విడిపోవాలని పెళ్లి చేసుకోరు..
చాలా మంది ‘ఈ మధ్య విడాకులు కామన్‌ అయిపోయాయి’ అంటున్నారు. కానీ గతంలోనూ భార్యభర్తలు మధ్య విబేధాలు, గొడవలు జరిగేవి. కానీ తిరిగి ఇంటికి వెళ్తే..మా నాన్న పోషించగలరా అన్న భయంతో అలాగే కొనసాగేవారు. అప్పట్లో ఒక మహిళ తన అవసరాల కోసం కూడా అబ్బాయిపై ఆధారపడేది కానీ ఇప్పట్లో అమ్మాయిలు వాళ్లకేం కావాలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగా చూసుకునే పేరెంట్స్‌ ఉంటున్నారు. ఎవ్వరూ కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు.  మా మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివి అనిపించింది అందుకే విడాకులు తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఒకరినొకరు బాగా కొట్టుకొని విడిపోతే అది తొందరగా మరచిపోతారు కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం’ అని నిహారిక అన్నారు. విడాకుల తర్వాత మాజీ భర్తలో టచ్‌లో ఉన్నారా అని యాంకర్‌ అడగగా.. ‘అలాంటిదేమి లేదు. ఇంతవరకు మేము మళ్లీ కలుసుకోలేదు. ఫోన్‌ కాంటాక్ట్‌ కూడా లేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement