Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ys Jagan Emotional Tweet On People Affection
మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ‘‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం… pic.twitter.com/lVcgXOuo8N— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024 వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్‌ జగన్‌కి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్‌ఆర్‌కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా జగన్‌ కాన్వాయ్‌ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు.శావల్యాపురం నుంచి వినుకొండ వరకు జనం ప్రతిచోటా రోడ్లపైకి వచ్చారు. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్‌ ఇంటికి వెళ్లడానికి గంటన్నర సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్‌ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్‌ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్‌ కాలనీ మీదుగా రషీద్‌ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్‌ కోసం వేచి ఉన్నారు. పలు చోట్ల యువకులు, మహిళలు జగన్‌ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్‌ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.

Crowdstrike may lose 6 billion fifth of its value amid global IT outage
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్‌లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్‌లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ వాల్యుయేషన్‌లో దాదాపు 16 బిలియన్‌ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్‌ సెన్సార్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్, సర్వీసెస్‌ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్‌ దాడి కాదు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తప్పుడు అప్‌డేట్‌ను రన్‌ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్‌’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్‌ సీఈఓ జార్జ్‌ కుర్జ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

Tripti Dimri Bad Newz Movie Review And Rating Telugu
'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?

'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్‌గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్‌టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.కథేంటి?చెఫ్‌గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష‍్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్‌కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్‌కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లే‌తోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్‌లో ప్రధాన పాత్రధారులు ఇ‍ద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్‌టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్‌కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ)

Kethireddy Pedda Reddy Who Went To Tadipatri Police Station
తాడిపత్రిలో హై టెన్షన్‌

సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బెయిల్‌ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్‌ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.

Special story on Eminant Sculptor dr Snehalatha Prasad
మహిళలకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ వరం : ఆమె ‘కళ’ కో లెక్క ఉంది!

ఆమె అందరిలా కాదు. సవాళ్లను ఎదుక్కోవడం అంటే ఇష్టం. విభిన్నంగా ఉండటం తన నైజం. అందుకే చిన్నప్పటినుంచీ అందరిలా రంగుల లోకంలో విహరించలేదు. రంగులనే తన లోకంగా ఎంచుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు.. అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగా అవతరించారు. మహిళా శిల్పిగా గత రెండు దశాబ్దాలుగా అనేక అపురూప శిల్పాలతో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్న డా. స్నేహలత ప్రసాద్‌ను సాక్షి.కాం పలకరించింది.ప్రతి మహిళకూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కానీ కుటుంబం, పెళ్లి, పిల్లల బాధ్యతలు వారికి కల సాకారానికి బ్రేక్‌ పడుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తామేంటో నిరూపించుకుంటారు. ఆ కోవకే చెందిన వారే డా. స్నేహలత. ఆ అవకాశమే ‘సెకండ్‌ ఇన్నింగ్స్‌’ అంటారు స్నేహలత. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు సృష్టించ కుండా, చేయూతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటారు ఆమె. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జన్మించారు స్నేహలత. తల్లి లీలాదేవి అండతో కళారంగంలోకి అడుగుపెట్టారు ఫైన్‌ ఆర్ట్స్‌సబ్జెక్ట్‌లో పోస్ట్‌-గ్రాడ్యుయేషన్‌, ఆ తరువాత పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. పెళ్ళి తరువాత హైదరాబాద్‌కు రావడం, ఇద్దరు సంతానం కుటుంబం, పిల్లల బాధ్యతల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. కానీ తనలోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.బాధ్యతల్లో కాస్తంత వెసులుబాటు, భర్త డా.ప్రసాద్‌ తోడ్పాటుతో తన కరియర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది అని అంటారు డా. స్నేహలత. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతిపెద్ద పెయింటింగ్‌ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు. ప్రకృతి, పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమ అంతా ఆమె ప్రతీ పెయింటింగ్‌లోనూ గోచరిస్తుంది. ఢిల్లీ, జైపూర్‌, హైదరాబాద్‌లో అనేక ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ నిర్వహించారు. దాదాపు అన్ని గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. ఈ విజయమే తనకు మరింత ప్రోత్సాహాన్నించింది అన్నారు ఆమె.చిత్రకళలో కరియర్‌ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ ఏర్పడింది. పట్టుదలగా అందులోనూ రాణించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్‌ ఇలా మీడియం ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలోనూ ఆమెది అందె వేసిన చేయి. తెలంగాణా కోసం చార్మినార్‌పుట్టింది రాజస్టాన్‌లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్‌ వచ్చిన తరువాతే. అందుకే హైదరాబాద్‌ కోసం ఏదైనా చేయాలనే తపన నాలో చాలా ఉంది. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమలనుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్‌లు, నట్లు తదితర స్క్రాప్‌తో తెలంగాణాకు తలమానికమైన చార్రితక కట్టడం ‘చార్మినార్‌’ను యథాతథంగా నిర్మించాలనుకుంటున్నాననీ, అది కూడా సందర్శకులు చార్మినార్‌ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలనుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని చెప్పారుచెత్తనుంచే చిత్రమైన కళాకృతులుపనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాలనుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం ఒక మహిళగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నివారణలో అందరమూ తలా ఇంత చేయాల్సిందే అని సూచించారు. చిన్నప్పటినుంచీ గొప్పగా, పెద్దగా సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకున్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్ము, ధూళి నాకు కనిపించదు. 200 ఏళ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. చిత్ర కళ అయినా, శిల్ప కళ అయినా ఇందులో గణితం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒకఅందమైన చిత్రంగా మల్చుకున్నాను అని చెప్పారు స్నేహలత.విద్యార్థుల కోసం గురుకులం‘‘గురుకుల లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదల చిత్రకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ,సంప్రదాయాల మీద వారికి అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే ఎవరూ ఉహించలేని అద్భుతాలు సృష్టిస్తారు.’’- స్నేహలతమహిళలకో మాట‘ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. పట్టుదలా ఉంటుంది. కానీ నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకులొస్తాయి. తీరా చదువుకున్నాక, కుటుంబం ముందు, కరియర్‌ తరువాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రీత్యా చాలామంది తమలోని ఆశలను చంపేసు కుంటున్నారు. కానీ, అలా కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి...’ ఇదీ స్నేహలత మాట!

Japan Spreading New Covid 19 Corona Variant KP 3
మరో కరోనా వేవ్‌.. జపాన్‌లో పెరుగుతున్న కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు. తాజాగా జపాన్‌లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్‌ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్‌ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్‌ ఇప్పుడు జపాన్‌ను వణికిస్తోంది.జపాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కజుహిరో టటేడా తెలిపిన వివరాల ప్రకారం కేపీ.3 వేరియంట్ జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ ​కొత్త వేరియంట్‌ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్‌ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం.ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్ -19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైనవి కావని టాటెడా చెప్పారు. కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుండి 7 వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది.

Harbhajan Singh lashes out at Pakistani fan for comparing MS Dhoni And Rizwan
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్‌: భజ్జీ ఫైర్‌

భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జ‌ర్నలిస్ట్‌కు అద‌రి పోయే కౌంట‌రిచ్చాడు. భార‌త మాజీ కెప్టెన్‌, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెట‌ర్ మహ్మద్ రిజ్వాన్‌తో పోల్చినందుకు స‌దరు జ‌ర్న‌లిస్ట్‌పై హర్భజన్ మండిప‌డ్డాడు.ఫ‌రీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్‌ జ‌ర్న‌లిస్ట్ ఎంఎస్ ధోని, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌ల‌లో ఎవ‌రు బెట‌ర్ అన్న పోల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భ‌జ్జీ ఇదేమి చెత్త ప్రశ్న‌ అంటూ ఫైర‌య్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భ‌య్యా అత‌డికి ఎవ‌రైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్‌కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విష‌యం రిజ్వాన్‌ను అడిగినా అత‌డు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అత‌డు జ‌ట్టు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్‌లో ఇప్ప‌టికీ ధోనినే నంబర్ వ‌న్‌. వికెట్ల వెన‌క ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్‌లో భ‌జ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్‌లో ధోని కంటూ ఒక ప్ర‌త్యేక‌స్ధాన‌ముంది.భార‌త్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అత‌డి సార‌థ్యంలోనే 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024

BRS leader Kavita health deteriorated
క్షీణించిన కవిత ఆరోగ్యం!

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ తిహార్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరో గ్యం క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తిహార్‌ జైలు అధికారులు కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్‌ కంటతడి పెట్టారు. ఎయిమ్స్‌లో ఆమెను చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది.ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్‌ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచి్చంది. పదికిలోల బరువు తగ్గిన కవిత భర్త అనిల్‌ సమక్షంలో కవితకు ఎయిమ్స్‌ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత పది కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. కవిత నీరసంగా ఉండటం, ఇంకా జ్వరంతో బాధపడటం, బరువు తగ్గడంపై అనిల్‌ చలించిపోయారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరి యా టెస్టులు చేశారు. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పది కిలోల బరువు తగ్గిన విషయాన్ని తండ్రి కేసీఆర్, తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్‌రావుకు తెలిసి ఆమె అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదన కనబరుస్తున్నట్లు సమాచారం. జైలులో దోమలు అధికంగా ఉండటం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు. సోమవారం ఢిల్లీకి కేటీఆర్, హరీశ్‌ అనారోగ్యానికి గురైన కవితను రెండు పర్యాయాలు దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రికి, ఒకసారి ఎయిమ్స్‌కు తరలించిన తిహార్‌ జైలు అధికారులు పరీక్షలు చేయించారు. తిహార్‌ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు సోమవారం కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి రానున్నారు.

Microsoft Outage Effected America Air Traffic Severly
మైక్రోసాఫ్ట్‌ బగ్‌ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!

న్యూయార్క్‌: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్‌ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో బగ్‌ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీలైన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌,డెల్టా,యునైటెడ్‌ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్‌ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్‌ వీడియోను ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. విమానాల ట్రాఫిక్‌ టైమ్‌లాప్స్‌ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all