అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్‌ కలిస్తే.. ఆసక్తిగా ట్రైలర్ | Natural Star Nani Released Meet Cute Web Series Trailer Today | Sakshi
Sakshi News home page

Meet Cute Trailer: 'మీట్ క్యూట్' అంటే అర్థం తెలుసా?.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

Published Fri, Nov 18 2022 4:45 PM | Last Updated on Fri, Nov 18 2022 4:46 PM

Natural Star Nani Released Meet Cute Web Series Trailer Today - Sakshi

నాని సోదరి దీప్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’. ఈ సిరీస్‌లో సత్యరాజ్‌‌, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునయన ప్రధాన పాత్రల్లో నటించారు. ఐదు విభిన్నమైన కథలతో సరికొత్తగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌ నవంబర్‌ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో  ప్రసారం కానుంది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ను న్యాచురల్‌ స్టార్ నాని రిలీజ్ చేశారు. నాని  సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ఈ వెబ్‌ సిరీస్ తెరకెక్కించారు. 

(చదవండి: నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అదే.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్)

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. 'మీకు మీచ్ క్యూట్ అంటే తెలుసా.. అంటే అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్‌ ఫస్ట్‌ టైమ్ కలిసినప్పుడు.. ఆ క్యూట్ సిచ్యువేషన్స్.. వారి మధ్య జరిగే సంభాషణలు.' అనే నాని వాయిస్‌తో ప్రారంభమైంది. 'ఈ మనిషితో గొడవపడటం కూడా అనవసరం కదా అనుకున్నప్పుడే బంధాలు విఫలమవుతాయి. మనం  ప్రేమించే వాళ్లతోనే కదా గొడవపడతాం' అంటూ సాగే సత్యరాజ్‌ మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఏదైనా రిలేషన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే గొడవలను పరిష్కరించుకుని బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేయాల్సిన పనులను వివరిస్తూ సిరీస్ రూపొందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement