నరేశ్‌ అంటే ఎవరు అన్నారు | Naresh says Martin Luther King is an entertainer with a bullet like message | Sakshi
Sakshi News home page

నరేశ్‌ అంటే ఎవరు అన్నారు

Oct 19 2023 4:17 AM | Updated on Oct 19 2023 4:17 AM

Naresh says Martin Luther King is an entertainer with a bullet like message - Sakshi

సంపూర్ణేష్‌ బాబు హీరోగా వీకే నరేష్, శరణ్య ప్రదీప్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేశ్‌ మహా స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అదించడంతో పాటు క్రియేటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వీకే నరేశ్‌ మాట్లాడుతూ–

‘‘వినోదం, సందేశం... ఈ రెండు అంశాలు మిళితమై ఉన్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’లో ఈ రెండూ ఉన్నాయి. ఓ గ్రామంలోని రాజకీయ వర్గానికి నాయకుడిగా నటించాను. తమిళ  ‘మండేలా’ సినిమాకు ‘మార్టిన్‌..’ చిత్రం స్ఫూర్తి మాత్రమే. పూర్తి స్థాయి రీమేక్‌ కాదు. ఈ సినిమా సంపూర్ణేష్‌కు సెకండ్‌ ఇన్నింగ్స్‌లా ఉంటుంది. 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ– ‘‘కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల నుంచి ఇండస్ట్రీకి తిరిగొచ్చిన ప్పుడు నరేశ్‌ అంటే ఎవరు? అని కొందరు అన్నారు. ఎస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. ఈ తరం దర్శకులు నాకోసం పాత్రలు రాయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement