టొరంటో చిత్రోత్సవంలో జెర్సీ | Nani Jersey selected for International Indian Toronto Film Festivel | Sakshi
Sakshi News home page

టొరంటో చిత్రోత్సవంలో జెర్సీ

Aug 1 2020 1:39 AM | Updated on Aug 1 2020 1:39 AM

Nani Jersey selected for International Indian Toronto Film Festivel - Sakshi

నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గతేడాది విడుదలైన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో పలు ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రబృందం మరో తీపి కబురు అందుకుంది.

ఈ ఏడాది ఆగస్టు 9 నుండి 15 వరకు జరిగే భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ‘జెర్సీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ‘‘మన దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న కెనడాలో మా చిత్రం ప్రదర్శితం కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నాగవంశీ. ఇదిలా ఉంటే ‘జెర్సీ’ హిందీలో రీమేక్‌ అవుతోంది. షాహిద్‌ కపూర్‌ హీరోగా ఈ రీమేక్‌ని గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement