Virata Parvam Movie Update: 'Nagadarilo Song' out from Virata Parvam Movie - Sakshi
Sakshi News home page

Virata Parvam: ఆకట్టుకుంటున్న ‘నగాదారిలో....’పాట

Jun 2 2022 1:30 PM | Updated on Jun 2 2022 2:05 PM

Nagadarilo Song Out From Virata Parvam Movie - Sakshi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘నగాదారిలో..’పాటను విడుదల చేశారు. ‘నిప్పు ఉంది, నీరు ఉంది నగాదారిలో..చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో..’అంటూ సాగే ఈ పాటకు ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్‌ అందించగా.. ఫోక్‌ సింగర్‌ వరం అద్భుతంగా ఆలపించారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించాడు.

హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ కథను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. ఒక తిరుగుబాటు దారుడు ప్రేమలో పడిన తర్వాత కొత్త ప్రయాణంలో తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు పూర్తి భిన్నంగా ఎలా మారాడు అనేది ఈ పాట ద్వారా తెలుస్తుంది.  ఇక ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ప్రియమణి, నందిత దాస్‌, నవీన్‌ చంద్రలు ముఖ్య పాత్రలు పోషించారు. ద‌గ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement