కూతురి గురించి చెప్తూ నాగబాబు భావోద్వేగం

Nagababu: Less Communication With Niharika After Marriage - Sakshi

మెగా బ్రదర్‌ నాగబాబుకు తన గారాలపట్టి నిహారిక అంటే కొండంత ప్రేమ. ఆమె చిన్నప్పుడు స్కూలుకు వెళ్తేనే ఎంతగానో మిస్సయ్యేవాడు. అలాంటిది ఇటీవలే ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి సాగనంపాడు. ఈ క్రమంలో ఆమె ఇల్లు వదిలి వెళ్తుంటే పొంగుకుస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. చిన్నపిల్లాడిలా మనసారా ఏడ్వాలని ఉన్నా పెద్దరికం అడ్డొచ్చి గొంతులోనే దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. (చదవండి: ఫ్యాట్‌ తగ్గించుకోవడానికి తమన్నా తిప్పలు.. వీడియో వైరల్‌)

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కూతురి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. "సాధారణంగానే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నాకు కూతురు పుట్టాలని చాలా కోరుకున్నాను. అలా నాకు రెండోసారి నిహారిక పుట్టింది. ఆమె నాకు బెస్ట్‌ఫ్రెండ్‌. చాలా విషయాల్లో నాకు, నా కూతురుకు ఎక్కువ కమ్యూనికేషన్‌ ఉంటుంది. కానీ ఇప్పుడు పెళ్లైంది కదా! మాటలు తగ్గించేసింది. అయినా సరే నాకు సంతోషంగానే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా మెగా డాటర్‌ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహం డిసెంబర్‌ 9న జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు జైపూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌ వేదికగా మారింది. (చదవండి: కాలమే నిర్ణయిస్తుంది.. నాగబాబు భావోద్వేగం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top