ఫ్యాట్ తగ్గించుకోవడానికి తమన్నా తిప్పలు.. వీడియో వైరల్

‘ఐయామ్ బ్యాక్’ అంటు న్నారు తమన్నా. ఆ మధ్య తమన్నా కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో కాస్త బరువు పెరిగారామె. కోవిడ్ ముందు ఎంత బరువున్నానో ఆ బరువుకి వచ్చేశానోచ్ అంటున్నారామె. రెగ్యులర్ వర్కౌట్స్ వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను పంచుకుని ఇలా అన్నారు తమన్నా. ‘‘ఏదైనా సరే అతిగా చేయక్కర్లేదు. చేసే పనిలో స్థిరత్వం ఉంటే ఏదైనా సాధించొచ్చు. రెండు నెలల పాటు ఎంతో క్రమశిక్షణతో వర్కౌట్స్ చేశాను. కోవిడ్ రాకముందు ఎలా ఉన్నానో అలా మారిపోయాను. వర్కౌట్స్ చేయకపోవడానికి వంకలు వెతక్కండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి’’ అన్నారు తమన్నా. ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, గుర్తుందా శీతాకాలం’ సినిమాలు చేస్తున్నారామె.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి