అమీర్‌పేటలో ‘ఇస్మార్ట్‌ బ్యూటీ’ నభానటేష్‌ సందడి 

Nabha Natesh Launches Gismat Mandi Arabic Restaurant In Ameerpet - Sakshi

అమీర్‌పేట: విభిన్న ఆహార రుచులకు హైదరాబద్‌ కేరాఫ్‌గా నిలుస్తోందని సినీ నటి సభా నటేష్‌ అన్నారు. అమీర్‌పేటలో నూతనంగా ఏర్పాటైన జిస్మత్‌ మండి అరబిక్‌ జైల్‌ థీమ్‌ రెస్టారెంట్‌ను టాలివుడ్‌ నటి ఇస్మార్ట్‌ శంకర్‌ ఫేమ్‌ నభా నటేష్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు జైల్‌ థీమ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని  అన్నారు.    

విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో జిస్మత్‌ అరబిక్‌ మండీలు ఉన్నాయని, త్వరలో ఏఎస్‌రావునగర్, దిల్‌సుఖ్‌నగర్, ఏలూరుతో పాటు బెంగుళూరులో తమ శాఖలను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు యూట్యూబర్‌ గౌతమి, ధర్మా తెలిపారు. మండీలను జైలును తలపించే తరహాలో తీర్చిదిద్దామని, ఖైదీల వేషధారణలో కారాగారం డైనింగ్‌ సెటఫ్‌లో కూర్చునే ఆహార ప్రియులకు ఆహారం అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ హిమజ, టీఆర్‌ఎస్‌ నాయకుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top