బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ .. సోషల్ మీడియాలో వైరల్! | Naagin actress Aashka Goradia announces pregnancy | Sakshi
Sakshi News home page

Aashka Goradia: ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌ బాస్ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

May 14 2023 5:11 PM | Updated on May 14 2023 5:24 PM

Naagin actress Aashka Goradia announces pregnancy - Sakshi

బుల్లితెర నటి ఆష్కా గోరాడియా బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. క్కుసుమ్‌, లాగీ తుజ్సే లగాన్‌లో సీరియల్స్‌లో పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగిని సీరియల్‌లోనూ నటించింది. తాజాగా మదర్స్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఆష్కా గోరాడియా. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్‌లో తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

(ఇది చదవండి: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్‌)

కాగా.. 2017లో బ్రెంట్ గోబుల్‌ను ఆష్కా గోరాడియా వివాహమాడింది. వీరికి పెళ్లైన దాదాపు ఆరేళ్లకు గర్భం దాల్చినట్లు ప్రకటించింది బాలీవుడ్ భామ.  హిందీ బిగ్ బాస్ -6 సీజన్‌లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొన్నారు. మాతృ దినోత్సవం రోజున ఈ శుభవార్తను పంచుకోవడం ఆనందంగా ఉందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియోనూ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: కేవలం దాని కోసమే పెళ్లి చేసుకుంటున్నారు: వివేక్ సంచలన కామెంట్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement