Adah Sharma Shared Interesting Post on Her Instagram About the Kerala Story Movie - Sakshi
Sakshi News home page

The Kerala Story: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్‌

May 14 2023 1:36 PM | Updated on May 14 2023 4:03 PM

Adah Sharma Shared Interesting post On Her Instagram About The Kerala Story Movie - Sakshi

పలు వివాదాల మధ్య మే 5 విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే  రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో షాలినీ ఉన్నికృష్ణన్‌ పాత్రలో నటించిన ఆదా శర్మ తో పాటు మిగిలిన నటీనటులపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.  

(చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్‌ )

అదా శర్మ కృతజ్ఞతలు
తమ చిత్రానికి భారీ విజయం అందించిన ప్రేక్షకులను కృతజ్ఞతలు చెప్పింది అదా శర్మ.  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది. ‘నా నిజాయతీని కొందరు అపహాస్యం చేశారు. మా చిత్తశుద్దిని చులకనగా చూశారు. ‘ది కేరళ స్టోరీ టీజర్‌ వచ్చాక ఈ సినిమాను రిలీజ్‌ చేయొద్దని బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేశాయి. అయినా కూడా ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇంతగా ఆదరించినందుకు అందరికి ధన్యవాదాలు. ఈ మూవీ విషయంలో ఆడియన్స్‌ గెలిచారు’ అని అదా శర్మ రాసుకొచ్చింది. 

‘కేరళ స్టోరీ’లో ఏం చూపించారు
కేరళలోని లవ్ జిహాద్, రాడికలైజేషన్, ఐసిస్ రిక్రూట్ మెంట్, లైంగిక బానిసత్వం లాంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ జిహాద్ వల్ల ముగ్గురు అమ్మాయిలు ఎలాంటి దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement