వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. మదర్స్‌ డే రోజు ఉపాసన ఆసక్తికర పోస్ట్‌

Mothers day 2023: Ram Charan Wife Upasana Konidela Baby Bump Pics Goes VIral - Sakshi

మెగా కోడలు, గ్లోబర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి. పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఉపాసన ఇంట్లోనే ఉంటూ.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

(చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!)

ఇదిలా ఉంటే.. మదర్స్‌ డే సందర్భంగా నేడు బేబీ బంప్‌ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఉపాసన. ఈ సందర్భంగా ఆమె ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. తల్లి కావాలనే నా నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో తీసుకున్నది కాదు. నా బిడ్డకు అంతతేని ప్రేమని పంచడంతో పాటు జాగ్రత్తగా చూసుకుంటానని మానసికంగా ప్రిపేర్‌ అయ్యాకనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన రాసుకొచ్చింది. 

(చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్‌ వీళ్లే )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top