
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే వరుసగా ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్స్ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఇందులోని ‘బడిలో చెప్పని పాఠం ఇదిరా.. బతికే నేర్చుకో నా కొడుకా’ అనే ఎమోషనల్ పాట వీడియో వచ్చేసింది. నంద కిశోర్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సింధూరి విశాల్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.