మరో పోర్న్‌ యాప్‌ గుట్టు రట్టు..నిర్మాతపై కేసు నమోదు

Mumbai Police Files Harassment Case Against Producer Vibhu Agarwal - Sakshi

వీడియోల పేరుతో 28 ఏళ్ల మహిళపై స్టోర్‌ రూమ్‌లో అత్యాచారం

సాక్షి,ముంబై: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ బీటౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఓవైపు విచారణ కొనసాగుతుండగానే, మరో పోర్నో రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్‌పై కేసు నమోదైంది.

అసభ్యత, అశ్లీల కంటెంట్‌తో వీడియాలు రూపొందిస్తున్న అంశంపై ఉల్లూ యాప్‌ డిజిటల్‌ ప్రై.లి. కంపెనీ సీఈవో అయిన విభూ అగర్వాల్‌, కంపెనీ హెడ్‌ అంజలీ రైనాలపై అంబోలి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 354 కింద ఈనెల 4న కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పేర్కొన్నారు. అంధేరీలోని ఉల్లూ ఆఫీస్‌లోని స్టోర్‌ రూమ్‌లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ముంబై పోలీసులు తెలిపారు.

కాగా 2013లో బాత్‌ బాన్‌ గయూని సినిమా నిర్మించిన విభూ అగర్వాల్‌..డాన్స్ బార్ సినిమాతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. ఆ తర్వాత  2019లో ఉల్లూ యాప్‌ను ప్రారంభించి హిందీ, ఇంగ్లీష్‌,భోజ్‌పురి,తెలుగు, మరాఠీ సహా వివిధ భాషల్లో అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఉల్లూ యాప్‌ నిర్వహణతో పాటు వీడియోల పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు విభూ అగర్వాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top