అందుకే నటీనటులంతా చాలా అదృష్టవంతులు: నటి | Mridula Mahajan From Law Student To Being Actress | Sakshi
Sakshi News home page

Mridula Mahaja: 'లా' స్టూడెంట్‌ నుంచి వెబ్‌స్టార్‌గా..

Nov 7 2021 8:43 AM | Updated on Nov 7 2021 9:07 AM

Mridula Mahajan From Law Student To Being Actress - Sakshi

ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్‌ అని అడిగిన ఆమెకు, ఒకేసారి వెండితెర, వెబ్‌తెర, బుల్లి తెరల్లో తెరంగేట్రం చేసే అవకాశం లభించింది. వెబ్‌స్టార్‌గా ఎదిగింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. లా చదివిన యాక్టర్‌.. మృదులా మహాజన్‌.. 



  ♦ చండీగఢ్‌లో పుట్టి,పెరిగిన మృదుల.. పంజాబ్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేసింది. 

  ​​​​♦ చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే కాలేజీ రోజుల్లో నాటకాలు వేయడం మొదలుపెట్టింది. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా మారింది.  

   ♦  సినిమాల్లో నటించాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడింది. ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లింది. 

   ♦  2018లో అవకాశాలన్నీ ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. ఒకేసారి ఒక సినిమా, ఒక సీరియల్, ఒక ఆల్బమ్‌ సాంగ్‌లో నటించే చాన్స్‌ వచ్చింది.

  ♦   ‘పీటీసీ ఏక్‌ కహానీ: ఆజాద్‌’ పంజాబీ సినిమాతో వెండితెరను, ‘అన్‌టోల్డ్‌ లవ్‌’ సీరియల్‌తో బుల్లితెరను, ‘సహన్‌ దీ చార్ఖీ’ ఆల్బమ్‌తో వెబ్‌తెరను ఒకే ఏడాదిలో కవర్‌ చేసింది. 

   ♦  ఇన్ని లెరలనూ కవర్‌ చేస్తే.. ఒక్కచోటైనా క్లిక్‌ కాదా? అయింది కాబట్టే.. బాలీవుడ్‌లో మెరిసింది. 

   ♦  2019లో విడుదలైన ‘ట్యాంక్‌ క్లీనర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటింది. ప్రస్తుతం ‘గందీ బాత్‌’ సీజన్‌– 4 సిరీస్‌తో అలరిస్తోంది.  

అద్దె చెల్లించకుండా ఇంకొకరి జీవితంలో జీవించడమే నటన అంటే. అందుకే, నటీనటులందరూ చాలా అదృష్టవంతులు.

– మృదులా మహాజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement