‘నాగిని’ ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా? | Is Mouni Roy Engaged? Instagram Sparked With This Question | Sakshi
Sakshi News home page

‘నాగిని’ ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా?

Oct 30 2020 11:46 AM | Updated on Oct 30 2020 12:48 PM

Is Mouni Roy Engaged? Instagram Sparked With This Question - Sakshi

ముంబై: మౌనీ రాయ్‌ ‘నాగిని’ సీరియల్‌తో ఈమె సంపాదించుకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తన అందచందాలతో కుర్రకారు మతిపోగొ‍ట్టింది ఈ సుందరి. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం మౌనీ రాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్‌ పలు అనుమానాలు కలిగేలా చేస్తోంది. తన చేతికి ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఉన్న ఒక ఫోటోను ఆమె తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఆమె ఎవరికి తెలియకుండా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందా అంటూ ఆమె అభిమానులతో పాటు  పలువురు సెలబ్రెటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై స్పందిస్తూ ప్రొడ్యూసర్‌ ప్రజ్ఞా కపూర్‌ మాట్లాడుతూ, ఏంటి ఇది నాకు ఒక్క క్షణం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని పేర్కొన్నారు. పలువురు సెలబ్రెటీలు నీ ఎంగేజ్‌మెంట్‌ అని మాకు చెబుతున్నావా అంటూ ప్రశ్నించారు. అయితే ఇది మౌని రాయ్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ కాదని, ఆమె రింగ్స్‌ విక్రయించే ఒక బ్రాండ్‌ ప్రకటన కోసం ఆ ఉంగరాలు ధరించినట్లు తెలిసింది.
 

చదవండి: వేడుకల వేళ... ఆనందాల హేల    

Advertisement
 
Advertisement
Advertisement