విరాటపర్వం రోజే రిలీజవుతున్న మొన‌గాడు | Monagadu Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Monagadu Movie: మొనగాడు రిలీజ్‌ అయ్యేది ఎప్పుడంటే?

Jun 11 2022 6:33 PM | Updated on Jun 11 2022 6:33 PM

Monagadu Movie Release Date Out - Sakshi

"ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా మొన‌గాడు చిత్రాన్ని తెర‌కెక్కించాం. అన్ని కార్య‌క్ర‌మ‌లు పూర్తి చేసుకుని ఈ నెల 17న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో దేవ్ గిల్‌, ఛ‌త్ర‌ప‌తి పాత్ర‌లు చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాట‌లు ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి.

కీలుగుర్రం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆకుల వంశీ, పావని, దేవ్ గిల్, ఛ‌త్రపతి శేఖర్ మొదలగువారు నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం మొనగాడు. వంశీ ఆకుల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత వంశీ ఆకుల మాట్లాడుతూ..."ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా మొన‌గాడు చిత్రాన్ని తెర‌కెక్కించాం. అన్ని కార్య‌క్ర‌మ‌లు పూర్తి చేసుకుని ఈ నెల 17న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో దేవ్ గిల్‌, ఛ‌త్ర‌ప‌తి పాత్ర‌లు చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాట‌లు ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం"` అన్నారు. ఈ చిత్రానికి  సినిమాటోగ్రాఫ‌ర్ః ఉద‌య్ భాస్క‌ర్‌; సంగీతంః ర్యాప్ రాక్ ష‌కీల్‌; ఎడిట‌ర్ః బొంతాల నాగేశ్వ‌ర‌రెడ్డి. కాగా జూన్‌ 17న విరాటపర్వం, గాడ్సే సినిమాలు సైతం విడుదలవుతున్నాయి. మరి మొనగాడు ఆ సినిమాల నుంచి ఎదురయ్యే పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి!

చదవండి: కేరింత నటి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు వైరల్‌
లేటెస్ట్ ట్రెండ్.. స్టేజ్‌పై స్టార్‌ హీరోల స్టెప్పులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement