మెగాస్టార్‌కు విద్యార్థుల సర్‌ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..! | Megastar Waltair Veerayya First Look Reveals Mallareddy University Students | Sakshi
Sakshi News home page

Waltair Veerayya: ఆరువేల మందితో 'వాల్తేరు వీరయ్య' లుక్.. మెగాస్టార్‌కు సర్‌ప్రైజ్

Oct 30 2022 6:52 PM | Updated on Oct 30 2022 6:53 PM

Megastar Waltair Veerayya First Look Reveals Mallareddy University Students  - Sakshi

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టైటిల్, మెగాస్టార్ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా దర్శకుడు తన ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. 

(చదవండి: మెగా 154 టైటిల్‌ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్‌ లుక్‌)

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్శిటీ విద్యార్థులు చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' లుక్‌ను విద్యార్థులు రీ క్రియేట్‌ చేశారు. యూనివర్శిటీ మైదానంలో సుమారు ఆరువేల మంది విద్యార్థులు కూర్చుని మెగాస్టార్ రూపాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించి విజువల్స్‌ను యూనివర్శిటీలో జరిగిన క్యాన్సర్‌పై పోరాటం కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తూ వీడియోను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రేమకు ఫిదా అయిన చిరు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

మెగాస్టార్‌ పట్ల మీకున్న ప్రేమ ఈ వీడియో చూస్తే తెలుస్తోంది అంటూ దర్శకుడు బాబీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. దీనిపై నెటిజన్ క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు.  రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement