
భాగ్యనగరంలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక మహాంకాళి అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలైంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు.
చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఓ పదిహేను రోజులు షూటింగ్ జరిపితే ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ ఫైనల్ షెడ్యూ ల్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించనున్నారని తెలిసింది.