
నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ పరువు. జూన్ 14న ఓటీటీకి వచ్చేసిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు.
పరువు సీజన్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఓ చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అనే విషయంపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ అందించిన సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. నా సోదరుడు నాగబాబు అద్బుతంగా నటించారని చిరంజీవి కొనియాడారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, మిత్ తివారి కీలక పాత్రలు పోషించారు.
Congratulations #Paruvu team on the huge success👏.
Proud of you @sushkonidela for creating this groundbreaking Telugu OTT content
and my dear brother @NagaBabuOffl
for a brilliant performance.
ఒక చక్కటి plan తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2024