మెగాస‍్టార్‌ చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది? | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi Hand Surgery: చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది?

Published Sun, Oct 17 2021 8:35 PM

Megastar Chiranjeevi Right Hand Surgery - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి కుడి చేతికి సర్జరీ అయిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తన చేతికి సర్జరీ చేయించుకోవడంతో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారని చిరంజీవి తెలిపారు.  కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన అభిమానులతో చిరు ఆదివారం భేటీ అయ్యారు. కరోనా బారిన పడి ప్రజలు ఆక్సిజన్‌ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. కాగా, తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరు కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది. దీంతో చిరు స్పందిస్తూ..  తన కుడి చేతి మణికట్టుకి చిన్న శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు.

ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించడంతో వాళ్లు మణికట్టు దగ్గరున్న నరం మీద ఒత్తిడి పడిందన్నారని చెప్పారు. అందుకోసం శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సి అవసరం లేదని 15 రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. చేతికి జరిగిన సర్జరీ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని చిరు తన అభిమానులకు తెలిపారు.

చదవండి: Bigg Boss 5 Telugu: బొమ్మ‌తో ఎలిమినేష‌న్‌, భ‌యంతో ఏడుపందుకున్న ష‌ణ్ను

Advertisement
Advertisement